నెల రోజుల పాటు కాచిగూడ-నిజామాబాద్‌ డెమూ రైళ్లు రద్దు

కాచిగూడ-నిజామాబాద్‌ డెమూ రైళ్లను నేటి నుంచి మార్చి నెలాఖరు దాకా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది;

Update: 2025-03-01 07:53 GMT
kachiguda, nizamabad, DEMU trains, cancelled
  • whatsapp icon

కాచిగూడ-నిజామాబాద్‌మధ్య నడిచే డెమూ రైళ్లను నేటి నుంచి మార్చి నెలాఖరు దాకా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్‌ సెక్షన్‌లో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని కోరారు.

ఏసీ చెయిర్ కార్ ను...
లింగంపల్లి-విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ కు అదనంగా మరొక ఏసీ చైర్‌కార్‌ను జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. శనివారం విజయవాడ నుంచి లింగంపల్లి వచ్చే ఎక్స్‌ప్రె్‌సలో, ఆదివారం లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్‏లో ప్రయాణికులకు అదనపు ఏసీ చైర్‌కార్‌ పది హేను రోజుల పాటు అందుబాటులో ఉంటుందని చీఫ్ పీఆర్వో శ్రీధర్‌ తెలిపారు..


Tags:    

Similar News