తెలంగాణలో భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు

వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువల్ని 50 శాతం, ఖాళీ స్థలాల విలువను 35 శాతం, అపార్టుమెంట్ల విలువను

Update: 2022-01-21 05:47 GMT

తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరోమారు పెరగనున్నాయి. గతేడాది వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు రుసుములను ప్రభుత్వం పెంచింది. అప్పుడు 20 శాతం మేర వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువలను సవరించింది. మరోమారు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది టీఎస్ సర్కార్. కొత్త మార్కెట్‌ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం.

వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువల్ని 50 శాతం, ఖాళీ స్థలాల విలువను 35 శాతం, అపార్టుమెంట్ల విలువను 25 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు బహిరంగ మార్కెట్‌ లో విలువలు భారీగా ఉన్నచోట అవసరమైన మేరకు సవరించుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఈ మేరకు నాలుగైదు రోజుల్లో ఆర్డీవోల నేతృత్వం లోని కమిటీలు కొత్త మార్కెట్‌ విలువల్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.


Tags:    

Similar News