ఆ తండ్రి కన్నీటి వెనుక..!

భారత ఉపగ్రహం విక్రమ్‌ చంద్రుని మీద కాలు మోపిన క్షణం యావద్భారతం గర్వించింది. చంద్రుడి మీద కాలు మోపిన నాలుగో దేశంగా రికార్డు సృష్టించడమే కాదు, చంద్రుని దక్షిణ ధృవం మీద అడుగు పెట్టిన మొదటి దేశంగా ఇండియా చరిత్రకెక్కింది. ఇస్రో సైంటిస్టుల బృందం నిరంతరాయ కష్టానికి ప్రతిఫలం ఇది. ఈ విజయాన్ని దేశమంతా సొంతం చేసుకుంది. అందరి వాట్సప్‌ స్టేటస్‌లో కూడా చంద్రయాన్‌ విజయమే ప్రతిఫలించింది.

Update: 2023-08-24 04:35 GMT

చంద్రయాన్‌`3 విజయగాధ

భారత ఉపగ్రహం విక్రమ్‌ చంద్రుని మీద కాలు మోపిన క్షణం యావద్భారతం గర్వించింది. చంద్రుడి మీద కాలు మోపిన నాలుగో దేశంగా రికార్డు సృష్టించడమే కాదు, చంద్రుని దక్షిణ ధృవం మీద అడుగు పెట్టిన మొదటి దేశంగా ఇండియా చరిత్రకెక్కింది. ఇస్రో సైంటిస్టుల బృందం నిరంతరాయ కష్టానికి ప్రతిఫలం ఇది. ఈ విజయాన్ని దేశమంతా సొంతం చేసుకుంది. అందరి వాట్సప్‌ స్టేటస్‌లో కూడా చంద్రయాన్‌ విజయమే ప్రతిఫలించింది.

ఓ పెద్దాయన చంద్రుడి మీద కాలుపెట్టిన ‘విక్రమ్‌’ని టీవీలో చూస్తూ కన్నీరు పెట్టుకున్న దృశ్యం నిన్న వైరల్‌ అయింది. ఆ పెద్దాయన పేరు పలనివేళ్‌. దక్షిణ రైల్వేలో ఓ టెక్నీషియన్‌. చంద్రుడి మీద భారత జాడలు అడుగు పెట్టిన క్షణాన ఆయన భావోద్వేగానికి గురి కావడం వెనుక దేశం విజయమే కాదు, తన కొడుకు నిరంతర కష్టం కూడా ఉంది. మొక్కవోని దీక్ష ఉంది. ల్యాండ్‌ రోవర్‌ చంద్రుని తాకిన క్షణాన ఓ భారతీయునిగా, ఓ తండ్రిగా పలనివేళ్‌ గర్వంతో ఉప్పొంగిపోయాడు. ఇంతకీ ఆయన కొడుకు ఎవరో తెలుసా? చంద్రయాన్‌`3 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ఉన్న వీరముత్తువేళ్‌. చంద్రయాన్‌ విజయంలో ఆయన నాలుగేళ్ల ఆహోరాత్రాల శ్రమ ఉంది.

2019లో చంద్రయాన్‌`2 చివరి క్షణాల్లో విఫలం చెందడం ఇస్రోకి పెద్ద ఎదురు దెబ్బ. విఫలం వెనుక విజయానికి ఎంత కిక్కు ఉంటుందో, ఆ విజయం ముందు ముందు టెన్షన్‌ కూడా అంతే ఉంటుంది. ఈ ఒత్తిడిని అధిగమించి మన శాస్త్రవేత్తలు మనకి అందించిన గొప్ప బహుమతి చంద్రయాన్‌`3. ఈ మిషన్‌ డైరెక్టర్‌ వీరముత్తువేళ్‌ తమిళనాడులోని విల్లుపురం జిల్లావాసి. రైల్వే పాఠశాలలో చదివిన ఆయన మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లమా చదివారు. బీటెక్‌ చెన్నయ్‌లో చదివిన వీరముత్తువేళ్‌ మద్రాస్‌ ఐఐటీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. 1989లో ఇస్రోలో ఓ పైంటిస్టుగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఇస్రో స్పేస్‌ ఇన్‌ఫ్రాక్చ్రర్‌ ప్రోగ్రాంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేశారు. 2019లో చంద్రయాన్‌ ` 3 డైరెక్టర్‌గా అపాయింట్‌ అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో భారతదేశం స్పేస్‌ కొత్త చరిత్ర లిఖించింది.

Tags:    

Similar News