రాష్ట్ర రాజకీయాల్లోకి కవిత

రాజ్యసభ ఎన్నికల్లో కవిత పేరు ఖరారు చేయలేదు. అయితే శాసనమండలికి కవితను కేసీఆర్ ఎంపిక చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో [more]

Update: 2020-03-18 02:02 GMT

రాజ్యసభ ఎన్నికల్లో కవిత పేరు ఖరారు చేయలేదు. అయితే శాసనమండలికి కవితను కేసీఆర్ ఎంపిక చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కల్వకుంట్ల కవిత పోటీ చేయనున్నారు. ఈ మేరకు కవిత అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారు. నేడు కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆమెను రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావాలనే కేసీఆర్ భావించారు. అందుకే కవితను శాసనమండలికి ఎంపిక చేశారు. కవిత విజయం ఏకపక్షమే. ఈ పదవి మరో రెండేళ్లు మాత్రమే ఉంటుంది. భూపతి రెడ్డి పై అనర్హత వేటు పడటంతోనే ఈ ఎన్నిక అనివార్యమైంది.

Tags:    

Similar News